అరుణ

telugu sex stories boothu kathalu “కౌసల్యాసుప్రజ రామ పూర్వా సంధ్యాప్రవర్తతే…….

ఉత్తిష్టోతిష్ట గోవింద ఉత్తిష్ట ……..”

పూజగదిలోంచి రామారావుగారికంఠం గంభీరంగా వినిపిస్తూంది. ఆయన భార్య కమలమ్మగారు పూలసజ్జ నిండా పూలుకోసి తెచ్చి ప్రక్కనపెట్టింది. ఆయననోరు యథాప్రకారం స్తోత్రంచదువుతున్నా ఆయన కళ్ళు ప్రశ్నార్ధకంగా భార్యవంక చూశాయి.” అరుణ ఇంకా లేవలేదు. రాత్రి బాగా ప్రొద్దుపోయి వచ్చింది. అదివచ్చి పడుకునేసరికి ఒంటిగంట దాటింది” అంది ఆమె, ఆయన భావంగ్రహించి రామారావుగారు తల ఊపి యధాప్రకారంశ్రవ్యంగా, గంభీరంగాసుప్రభాతం చదవటంమొదలు పెట్టారు.

రోజుతెల్లవారి నాలుగుగంటలకే లేచి, కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి జపంపారాయణ పూజతంతులన్నీ ఓ గంట గంటన్నరజరపనిదే ఏ పని చేయరు ఆయన. పూజా పునస్కారములు ఆయన నిత్యకృత్యాలలో ముఖ్య భాగం. ఉదయం ఆయనతోపాటే కూతుర్నిలేపేసేవారు. చిన్నప్పటినుంచి ఆయన స్నానంచేసివచ్చేసరికి కూతురు ఉత్సాహంగా పెరట్లో ఉన్న పూలన్నీ ఒక్కటీమిగలకుండా కోసి తెచ్చిపెట్టేది.

ఇప్పుడు అరుణ పెద్దయ్యాక చిన్నప్పటి అలవాటు ప్రకారం తండ్రి లేవకముందేలేస్తుంది. తండ్రి కంటేముందుగానే స్నానం అదీ చేసి పూజ గదిలో అన్నీ సిద్దం చేస్తుంది. ఈ వేళ ఆ అలవాటుకు భిన్నంగా భార్యపూలు తేవడంకాస్త ఆశ్చర్యం కలిగించింది ఆయనకి. అందుకే భార్య వైపు ప్రశ్నార్ధకంగా చూశారు అరుణకిఒంట్లో బాగులేనప్పుడు, ఇతర కారణాలప్పుడుతప్ప ఇలా జరగదు.